13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌గా అగనూరు బస్వం, వైస్ చైర్మన్‌గా అందే మోహన్

16-02-2026 01:09 PM

షాద్‌నగర్,(విజయక్రాంతి): షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ గా అగనూరు బస్వం వైస్ చైర్మన్ గా అందే మోహన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నాడు షాద్నగర్ మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన 28 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది. బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన 11 మంది, ఒక ఇండిపెండెంట్, బిజెపి నుంచి ఒక వార్డు సభ్యుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు చైర్మన్గా  అగనూరు బస్వం, వైస్ చైర్మన్ గా అందే మోహన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ లను షాద్నగర్ ఎమ్మెల్యే అభినందించారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు