16-02-2026 01:00:07 PM
షాద్ నగర్ లో న్యాయ వాదుల విధుల బహిష్కరణ
షాద్‌నగర్,(విజయక్రాంతి): న్యాయవాది ఖదీర్(lawyer) హత్యకు గురికావడం పట్ల న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణ న్యాయవాద బార్ అసోసియేషన్ లో అధ్యక్షుడు వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి గుండుబావి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చీపిరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పట్టణ న్యాయవాదులు అందరూ నిరసన వ్యక్తం చేస్తూ న్యాయవాద విధులను బహిష్కరించారు.
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయవాద ప్రొటెక్షన్ యాక్టును(Lawyers Protection Act) అమలు చేయాలని, న్యాయవాది ఖదీర్ హత్యలో పాల్గొన్న నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టి, న్యాయం కోసం పోరాడే న్యాయవాదులను రక్షించాలని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా న్యాయవాద హక్కులను పరిరక్షించాలని నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు.
విధుల బహిష్కరణ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు(Bar Association Presidents) నర్వ వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి గుండు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు చీపిరి చంద్రశేఖర్, జాయింట్ సెక్రెటరీ నరసింహ, న్యాయవాదులు గంతల శివయ్య, విజయ దేశికాచారి, డి నరసింహులు, రజాక్ హుస్సేన్,అబ్దుల్ కరీం, బెన్నూరు చంద్రయ్య, చెంది మహేందర్ రెడ్డి, సబియా తదితరులు పాల్గొన్నారు.