ఏజెన్సీ రిజర్వేషన్లపై వైఖరి ప్రకటించాలి
లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్
భధ్రాద్రి కొత్తగూడెం, మే 2 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ రాజకీయ పార్టీ ల నేతలు గిరిజన ప్రాంతంలో 100 శాతం రిజర్వేషన్ అమలుపై తమ వైఖరి వెల్లడించాలని లంబాడా హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్ పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. గురువా రం కొత్తగూడెంలోని నేతాజీ మార్కె ట్ ప్రాంగణంలో ఆ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా రాజేశ్‌నాయక్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వానికి గిరిజన ఓట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ట్రైబల్ అడ్వైజర్ కమిటీని (టిఏసీసీ) ఏర్పా టు చేసి 100 శాతం గిరిజన రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ఈ నెల 4న కొత్తగూడెం పర్యటనలో ముఖ్యమంత్రి తమ వైఖరి తెలపాలని రాజేష్ నాయక్ డిమాండ్ చేశా రు. తమ హక్కుల సాధన కోసం జూన్ 20న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించ నున్నట్టు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గోండ్వాన విద్యా ర్థి సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు ఇరుప ప్రకాశ్‌దొర, ఆదివాసి నాయకులు అర్రెమ్ కృష్ణ, హరినాయక్, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




