3 April, 2026 | 8:14 PM

రాజన్న హుండీ.. రూ.1.52కోట్లు

03-05-2024 12:05 AM

రాజన్న సిరిసిల్ల, మే 2 (విజయక్రాంతి): ప్రముఖ క్షేత్రం వేములవా డ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి రూ.1.52 కోట్లు హుండీ ఆదాయం లభించింది.  గత 21 రోజుల హుండీ కానుకలను శుక్రవారం అధికారులు లెక్కింపు చేపట్టారు.  రూ.1.52 కోట్ల  నగదుతోపాటు 218 గ్రాముల బం గారం, 11.5 కిలోల వెండిని  భక్తులు సమర్పించారు. కార్యక్రమంలో ఈవో కృష్ణప్రసాద్, కరీంనగర్ ఏసీ కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ తతదితరులు పాల్గొన్నారు.