సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ హామీ
03-04-2026 06:11 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమురయ్య హామీ ఇచ్చినట్టు తపస్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర బాధ్యులు రాజేశ్వర్ తెలిపారు. ఉపాధ్యాయులకు పిఆర్సి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సిపిఎస్ రద్దు, కేజీబీవీ సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించగా ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.




