3 April, 2026 | 7:08 PM

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ నెర‌వేర్చ‌కుండా ప్ర‌జాపాల‌న‌ సంబురాలా..!

03-04-2026 05:50 PM

బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు పైత‌ర సాయికుమార్‌

మునిప‌ల్లి,(విజయక్రాంతి): ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌జ‌లను మ‌భ్య పెట్టేందుకు ఇప్పుడు 90రోజుల ప్ర‌జాపాల‌న సంబురాల‌ను చేయ‌డం  విడ్డురంగా ఉంద‌ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు పైత‌ర సాయికుమార్ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు. ప్ర‌జల‌కు ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వ‌చ్చినప్ప‌టికీ 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ పూర్తిగా నెరవేర్చారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌న్నారు.

అలాగే  రూ.4,000  వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినందుకా ఈ ప్రజా పాలనా..?,  కళ్యాణలక్ష్మిలో తులం బంగారం ఇచ్చారా ?,  మహిళలకు, నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం చేశారా..?,  రైతు కూలీలకు ఇస్తామన్న రూ.12,000 ఇచ్చినందుకా,  లేక రైతు భరోసా 3 విడతల నిధులు ఎగ్గొట్టినందుకా ఈ ప్రజా పాలనా...?,  ఇస్తామన్న దళిత బంధు ఇచ్చారా...?,  యువ వికాసం పథకం కింద విద్యార్థులకు ఇస్తానన్న రూ.5 లక్షల విద్యా భరోసా ఎక్కడా...?,  నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి - ఎక్కడా..? ఇవ‌న్న  నెర‌వేర్చ‌కుండా  90రోజుల  ప్ర‌ణాళిక ప్ర‌జాపాల‌న ఎలా చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చి సంబురాలు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.