calender_icon.png 2 September, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దూకుడుగా ఎమ్మెస్సార్

02-09-2025 12:05:24 AM

  1. పాలమూర్ మేయర్ అభ్యర్థి గా సురేందర్ రెడ్డి..?

ఎమ్మెల్యే, అధిష్టానంతో నిత్యం అనుసంధానం

ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన ఎమ్మెస్సార్

పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్

మహబూబ్ నగర్ సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి) :అధికార పార్టీ..తమ మేయర్ అభ్యర్థిగా మారేపల్లి సురేందర్ రెడ్డికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం. దీంతో మేయర్ పీఠాన్ని దక్కించుకొ నేందుకు సురేందర్ రెడ్డి తనదైన శైలిలో స్పీ డ్ పెంచి దూసుకుపోతున్నాడు. ప్రతి రోజు పార్టీ సమీక్షలతో బిజీ బిజీగా నిర్వహిస్తూ, డివిజన్ల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా వారిని అప్రమత్తం చేస్తున్నాడు.

నోటిఫికేషన్ కంటే ముందే పట్టణం లో ఇప్పుడు రాజకీయ వేడి తారాస్థాయికి చే రింది. ఇక రోజు వారీ పార్టీ కార్యక్రమాల ను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేతోపాటు రాష్ట్ర అధిష్టానం దృష్టి తీసుకెళ్లి వారి సూచనల మేర కు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం సొంత జిల్లా కావడంతో పాలమూర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్గా చు రుకైన నేతను నిలపాలనేది అధికార పార్టీ ఆలోచనా..

పార్టీ ఆలోచనకు అనుగుణంగా చురు కైన నేతగా ఆచాన్స్ని కొట్టేశాడని పార్టీ వర్గా లు చెబుతోన్నా మాట ఇది.. మన కా ర్పోరేషన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసు కొం దామనే నినాదంతో సురేందర్ రెడ్డి ముం దుకు వెళ్తున్నాడు. అందులో బాగంగానే పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ లో చేర్చుకోవడం పనిని వేగవంతం చేశారు.

ప్రతి రోజు ఉదయం నుండి రాత్రి వరకు పా ర్టీ నేతలు, కార్యకర్తలతో బిజీ బిజీగా సమీక్షలు చేస్తూ అందర్ని ఎన్నికలకు సిద్దపరుస్తున్నాడు. ఇలా సురేందర్ రెడ్డి స్పీడుకు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఆ పార్టీలను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నేతలంతా చేరిపోగా, మిగిలిన వారు సైతం నేడో రేపో చేరేందుకు సిద్దంగా ఉన్న ట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రతి పక్ష పార్టీలు అయితే మేయర్ అభ్యర్థిని కానీ, మేయర్ పీఠాన్ని దక్కించుకొంటామనే మాటేకానీ ఎత్తడడంలేదు.

 కార్పోరేషన్ స్థాయికి పాలమూర్ 

1952లో పాలమూర్ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడి అంచెలంచెలుగా ఎదుగుతూ స్పెషల్ గ్రేడ్ స్థాయికి చేరి నిన్నటి వరకు కొనసాగింది.. నేడు 60 డివిజన్లతో అతిపెద్ద కా ర్పోరేషన్గా ఎదగడంతో పాలమూర్ ము న్సిపల్ పరిధి ఇప్పుడు ఒక నియోజకవర్గ మంతా స్థాయికి విస్తరించింది..దీంతో కౌన్సి లర్లు కార్పోరేటర్లుగా, చైర్ పర్సన్ మేయర్ గా మారనున్నారు.. మేయర్కు అయితే ఇదివరకంటే ఎక్కువగా సకల అధికారాలు రా నున్నాయి..

అలాంటి మేయర్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకొంటోంది..మొదటి మేయర్ అభ్యర్థిగా ఎవ్వరిని పీఠంపై కూర్చోబెడతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ రికొద్ది రోజుల్లో నేడో రేపో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండడంతో పట్ట ణంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరిం ది. మొదటి సారి కార్పోరేషన్గా మారిన పాలమూర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకొనేందుకు అధికార పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాంది.

ఇక మేయర్ అభ్యర్థిగా అధికార పార్టీలో చురుకైన నేతగా పేరుపొందిన మారేపల్లి సురేంద ర్ రెడ్డికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో సురేందర్రెడ్డి మే యర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ కార్యక్రమాలపై మరింత వేగంగా అడుగులు వేస్తున్నాడు. పార్టీల నేతలు సైతం ఆ పార్టీలను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.

ఇప్పటి వరకు కాం గ్రెస్ పార్టీలో ప్రధాన నేతలంతా చేరిపోగా, మిగిలిన వారు సైతం నేడో రేపో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రతి పక్ష పార్టీలు అయితే మేయర్ అభ్యర్థిని కానీ, మేయర్ పీఠాన్ని దక్కించుకొంటామనే మాటేకానీ ఎత్తడడంలేదు.

- ట్రబుల్ షూటర్ ప్రత్యేక ముద్ర...

పార్టీలో ఏమైనా విభేదాలు కానీ, వివాదాలు కానీ ఏర్పడితే వాటిని తన చాక చక్యంతో పరిష్కరించి ట్రబుల్ షూటర్ గా నిలిచాడు. ఇక పార్టీ కార్యక్రమాల్లో తనదైన శైలిలో వ్యవహరిస్తూ, చురుకైన నేతగా ఒక ప్రత్యేక ముద్రను వేసుకొన్నాడు.. ఇక తన మాటల చాతుర్యంతో అయితే ఎదుటి వారి ని ఆకట్టుకోవడంతోపాటు, వారిని తనవెం టే తిప్పుకోవడంలో సురేందర్రెడ్డికి సాటే లే రు. ఎంత ఆవేశంగా ఉన్న వ్యక్తిని అయినా సరే తన మాటలతో కూల్ చేసే సామర్థ్యాన్ని తెచ్చుకొన్నాడు.

ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గ్పౌ వదిలి న తన మాటల తూటాలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ జోష్ని తీసుకొచ్చిందని చెప్పొ చ్చు. అప్పటి వరకు పట్టణంలో కాంగ్రెస్ పా ర్టీ గెలుస్తుందన్నా నమ్మకంలేని ప్రజలకు సురరేందర్ రెడ్డి మాటలు ఒక బలాన్నిచ్చా యి. అదిక వరకు చిన్నాభిన్నమైన కాంగ్రెస్ పార్టీ నేతలను తనదైన శైలిలో మెప్పించి ఒ ప్పించి అందర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా యెన్నం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడంలో సురేందర్ రెడ్డి సక్సెస్ ని సాధించా డు.

ఇక నియోజకవర్గంపై గతంలో స్వాతం త్య్ర అభ్యర్థిగా పోటీచేసిన అనుభవం ఉండడంతో నియోజకవర్గమంతా చక్కబెట్టడంలో చురుకుగా వ్యవహరించాడనేది పార్టీ వర్గా లు చెబుతోన్నా మాట. ఇప్పుడు సైతం ని యోజకవర్గంలో ఏమైనా ఇబ్బందులు కానీ, విమర్శలు కానీ ఏర్పడితే వాటిని తక్షణమే పరిష్కరించడంలో ఒక ప్రత్యేక స్థానం దక్కించుకొన్నట్లు తెలుస్తోంది.

తాజాగా పాలమూ ర్ మున్సిపల్ మేయర్ గా ఉంటే తన పదునైనా తెలివితో పట్టణాన్ని రాష్ట్రంలోనే ప్రత్యే క గుర్తింపుని తీసుకొస్తానేది సురేందర్ రెడ్డి ఆలోచన. అందుకు అనుగుణంగానే పట్టణంలో రాజకీయ చక్రాన్ని సంధిస్తూ ఎమ్మె ల్యే సహకారంతో ముందుకు వెళ్తున్నాడు.