calender_icon.png 2 September, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శంలో.. వేతనాల వెతలు

02-09-2025 12:18:17 AM

-ప్రారంభమైన ఉద్యోగుల పోరుబాట

-ఆరు నెలల నుంచి వేతనాలు అందక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సతమతం

నిర్మల్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): పేరులోని ఆదర్శం... అందులో పని చేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత ఆరు నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు పోరుబాట పట్టారు. ప్రభుత్వం 2013 లో ఆదర్శ మోడల్ పాఠశాలను ఏర్పాటు చేసి వాటిని ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసింది. గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడి యంలో కార్పొరేట్ చదువులను అందించేందుకు ఆదర్శ మోడల్ స్కూల్, కళాశాలలో ఏర్పాటు చేశారు.

అదిలాబాద్ జిల్లాలో మొత్తం 14 పాఠశాలలు ఉండగా ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్లు వాచ్మెన్లు పీడీలు ఇతర సిబ్బందిని అవుట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 పాఠశాలలో ఔట్సోర్సింగ్ లో 58 మంది విధులు నిర్వహిస్తుండగా వీరికి ఏజెన్సీ ద్వారా ప్రతినెల 19,500 వేతనాలను ప్రభుత్వం విడు దల చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు విద్యా కేలండర్లో ఉపాధ్యాయులు రెగ్యులర్ సిబ్బందితో కలిసి సమానంగా విధులు నిర్వహి స్తున్నప్పటికీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అసలే తక్కువ వేతనం వచ్చిన వేతనంలో ఇతర అలవెన్స్ పిఎఫ్ ఫోను చేతికి 15,000 వస్తుండగా వాటితోనే కుటుంబాలను పోషించుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నిర్మల్ బూత్ బాజారత్నూర్ గుడి ఆత్నూర్ బంగారు గూడ నార్నూర్ ఆసిఫాబాద్ కోటపల్లి దండేపల్లి మంచిర్యాల్ లింగాపూర్ మోడల్ స్కూ ల్ ఉండగా ఇక్కడ విధులు నిర్వహించేవారు ఆరు నెలల నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కు వేతనాలు రాకపోవడంతో పిల్లల చదువు ఇంటి అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులను గురవుతున్నారు. 2024 25 మార్చ్ నుండి ఈ విద్యా సంవత్సరం  ఆగస్టు వరకు ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేతనాలను ప్రభుత్వం చెల్లించని పక్షంలో తాము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతూ సెప్టెంబర్ 1 నుంచి అవసరమైతే విధులను బహిష్కరించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. వేతనాల కోసం ఇప్పటికీ ఔట్సోర్సింగ్ ఉద్యోగు లు ఆయా పాఠశాలల ప్రిన్సిపల్‌లకు మండ ల తాసిల్దారులకు వినతి పత్రాలు అందించగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతి పత్రాలను అం దించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మోడల్ స్కూల్ లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఔట్సోర్సింగ్‌లో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువగా కంప్యూటర్ ఆపరేటర్లు వాచ్మెన్లు ఫిజికల్ డైరెక్టర్లు కావడంతో వారు విధులకు రాకుంటే పాఠశాలల నిర్వహణలో తీవ్ర ఆటంకాలు ఏర్పడి విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం చిన్న చూపు 

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న. అవుట్సోర్సింగ్ ద్వారా తమకు ప్రతినెల చెల్లించి వేతనాలు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమపై ప్రభుత్వం చిన్న చూపు చూడడం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వానికి వేతనాలు చెల్లించాలని ఇప్పటికి ఎన్నోసార్లు విన్నవించిన ప్రయోజనం లేకపోయింది. అందుకే రాష్ట్ర కమిటీ పిలుపుకు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వేతనాల కోసం శాంతియుతంగా తమ నిరసనలు తెలుపుతున్నాం.

 శృతి, ఫిజికల్ డైరెక్టర్, బోథ్

వేతనాలు రాక ఇబ్బంది

కుంటాల మోడల్ స్కూల్లో గత పది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న. కంప్యూటర్ సిస్టం వర్క్ పనులన్నీ నేనే చేస్తా. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తే తమకు ఔట్సోర్సింగ్ క్రింద ప్రభుత్వం 19500 వేతనం ఇస్తుంది. ఇందులో పిఎఫ్ ఇతర అలవెన్స్ పోను చేతికి వచ్చేది 15000 రూపాయలు మాత్ర మే. ఆరు నెలల నుండి వేతనాలు రాకపోవడంతో పిల్లల చదువు ఇంటి అవసరాలు తీర్చుకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం.

 ఆడెపు గజేందర్, కుంటాల