calender_icon.png 2 September, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫ్గా న్‌లో భారీ భూకంపం

02-09-2025 12:03:46 AM

రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రత

ఆదివారం అర్ధరాత్రి భారీ విపత్తు

800 మందికి పైగా మృతి

-2500 మందికి గాయాలు

-జలాలాబాద్ సమీపంలో భూకంపకేంద్రం

-8 కిలోమీటర్ల లోతులో గుర్తింపు

-ఆఫ్గాన్‌కు అన్నివిధాలా అండగా ఉంటాం: భారత ప్రధాని మోదీ

కాబూల్, సెప్టెంబర్ 1: ఆఫ్గానిస్థాన్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ భూకంపం విలయం సృష్టించింది. పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా 800 మందికిపైగా మరణించినట్టు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ ఆఫ్గానిస్థాన్ వెల్లడించింది.

మరో 2,500 మంది వరకు గాయపడినట్టు తెలిసింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానిక ఆస్పత్రు ల్లో మృత్యుఘోష వినిపిస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది గంట వ్యవధిలోనే భూమి  మూడు సార్లు కంపించినట్టు సమాచారం. యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిసింది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11:47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు.

ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావిత మైనట్టు సమాచారం. ఇండ్లు కూలడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్రస్తు తం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కిన వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్య మాల్లో చక్కర్లు కొడుతున్నాయి. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ పోస్ట్ పె ట్టారు. ‘ఆఫ్గానిస్థాన్‌లోని కునార్, నోరిస్థాన్, నంగర్హార్ ప్రావిన్స్‌లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడం తో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్యచోచరంగా మారింది. అసమర్థ తాలిబన్ ప్రభుత్వం ఈ విపత్తును ఎదు ర్కొనేందుకు సన్నద్ధంగా లేదు. ఈ విపత్కర సమయంలో కునార్ ప్రజలకు సాయం అవసరం’ అని పేర్కొన్నారు.

అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని కో రారు. భూకంపం కారణంగా పలువురు చనిపోయారనే వార్త విని తాను చలించిపోయి నట్టు క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ పోస్ట్ పెట్టారు. బాధితుల కోసం దేవున్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఓ ఆఫ్గాన్ అధికారి పేర్కొన్నారు. 20 నిమిషాల వ్యవధి తర్వాత 4.5 తీవ్రతతో మరో భూకం పం వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ దేశ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమాన్ మాట్లాడుతూ.. ‘చాలా ఎక్కువ మంది ప్రా ణాలు కోల్పోయారు. భూప్రకంపనలు సం భవించిన ప్రదేశాన్ని చేరుకోవడం చాలా క ష్టంగా ఉంది. అయినప్పటికీ సహాయక బృం దాలు అక్కడే ఉండి చురుగ్గా సహాయక చర్య ల్లో పాల్గొంటున్నాయి’ అని పేర్కొన్నారు. కాగా, ఆఫ్గనిస్థాన్‌లో వచ్చిన భూ ప్రకంపనల ధాటికి ఉత్తర భార తదేశంలోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. భవనాలు కంపించడంతో జనం భయంతో వీధుల్లోకి పరుగు లు పెట్టారు.

రెండేండ్ల క్రితం ఇదే ఘోరం..

2023లో ఆఫ్గానిస్థాన్‌లో ఇంతకు మిం చిన ఘోర విషాదం జరిగింది. భారీ భూప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్‌పై భూప్ర కంపనల తీవ్రత 6.3గా నమోదైంది. ఆ సమయంలో దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1500 మంది తీవ్రంగా గా యపడ్డారు. ఆఫ్గానిస్థాన్‌లో తరుచూ భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా హిందూ ఖుష్ పర్వతాల పరిధిలో ఎక్కువగా ప్రకంపనలు వస్తున్నాయి.

గాయపడిన పడినవారు త్వరగా కోలుకోవాలి: మోదీ

ఆఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించడంతో వందలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో కు టుంబసభ్యులను, సన్నిహితులును కోల్పోయిన వారికి ఈ విషాదాన్ని తట్టుకొనే శక్తినివ్వాలని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవు న్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. భూకం పం ధాటికి నష్టపోయిన ఆఫ్గాన్‌కు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.