చెస్‌తో చురుకుదనం: కొండా సురేఖ
హైదరాబాద్, మే 31 ( విజయక్రాంతి): చెస్ క్రీడ చురుకు దనాన్నిపెంచడంతో పాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగడాన్ని అలవర్చుతుందని.. మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ అబ్రా అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహించిన లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10 నిమిషాల్లో 100కు పైగా చెస్ మేట్లతో పజిల్‌ను పరిష్కరించిన ఐదేళ్ళ చెస్ క్రీడాకారిణి ఇషాని చక్కిలం ప్రతిభకు మంత్రి ముగ్గులయ్యారు. రాయ్ చెస్ అకాడమిలో శిక్షణ పొందిన ఇషాని అత్యంత చిన్న వయసులో అరుదైన ఫజిల్‌ను పరిష్కరిండం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇషానికి సర్టిఫికెట్‌ను ప్రధానం చేసి, పాప తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రీటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, పులువురు చెస్ క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.






