ఎదురులేని గాఫ్
మట్టికోటలో అమెరికా స్టార్ కోకో గాఫ్, ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ ఎదురు లేకుండా దూసుకెళ్తున్నారు. వీరిద్దరు వరుస విజయాలతో ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. ఓండ్రుసోవా, పొటపోవా, జాబుర్ ముందంజ వేశారు. భారత యువ ఆటగాడు శ్రీరామ్ బాలాజీ తొలిసారి గ్రాండ్‌స్లామ్ రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. సింగిల్స్‌లో రెండో ర్యాంకర్ సిన్నర్ ముందంజ వేయగా.. ఆరో సీడ్ రుబ్లెవ్‌కు షాక్ తగిలింది.
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్(అమెరికా) నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం మూడో రౌండ్‌లో గాఫ్ 6 6 డయానా యస్త్రేమ్స్‌కా (ఉక్రెయిన్)పై విజయాన్ని నమోదు చేసుకుంది. గంటా 34 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో గాఫ్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా కేవలం రెండు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించింది. 3 ఏస్‌లు కొట్టిన గాఫ్ 11 బ్రేక్ పాయింట్లు, 8 విన్నర్లు సంధించింది. ప్రిక్వార్టర్స్‌లో గాఫ్ ఇటలీకి చెందిన ఎలిసాబెట్టా కొక్కిరెట్టోను ఎదుర్కోనుంది. మరో మ్యాచ్‌లో పోలాండ్ బామ స్వియాటెక్ 6 6 మారి బౌజ్‌కోవా (చెక్ రిపబ్లిక్)పై విజయాన్ని అందుకుంది.
గంటా 33 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో స్వియాటెక్ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టింది. మిగతా మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ వోండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6 6 కోల్ పాక్వెట్ (ఫ్రాన్స్)పై, 8వ సీడ్ జాబుర్ (ట్యునిషియా) 6 7 లేలా ఫెర్నాండేజ్ (కెనడా)పై, రష్యా ప్లేయర్ అనస్తషియా పొటపోవా 7 6 (6/8), 6 గ్జిన్ యూ వాంగ్ (చైనా)పై విజయాలు సాధించి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు.
బాలాజీ శుభారంభం..
ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్‌లో బాలాజీ మార్టినేజ్ జోడీ 6 6 స్టాల్డర్ ద్వయంపై గెలిచి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జానిక్ సిన్నర్ జోరు కనబరుస్తున్నాడు. మూడో రౌండ్‌లో సిన్నర్ (ఇటలీ) 6 6 6 పావెల్ కొటోవ్‌పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సిన్నర్ 4 ఏస్‌లు సంధించాడు. 13 బ్రేక్ పాయింట్లు , 36 విన్నర్లు కొట్టి ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఆరో సీడ్ ఆండీ రుబ్ల్లెవ్‌కు షాక్ తగిలింది. మూడో రౌండ్‌లో ఇటలీకి చెందిన మాటియో ఆర్నాల్డీ 7 (8/6), 6 6 రుబ్లెవ్‌ను మట్టికరిపించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. 2 గంటల 33 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఆర్నాల్డీ 13 ఏస్‌లు, 47 విన్నర్లు సంధించాడు. 37 అనవసర తప్పిదాలతో రుబ్లెవ్ మూల్యం చెల్లించుకున్నాడు.






