2 July, 2026 | 3:47 AM

నీరజ్‌కు లైన్ క్లియర్

01-06-2024 12:05 AM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌కు ముందు యూరోప్‌లో 60 రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పెట్టుకున్న అభ్యర్థనను క్రీడా శాఖ అనుమతించింది. శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంవోసీ) కమిటీ నీరజ్‌తో పాటు పలు క్రీడాకారుల అభ్యర్థనలను పరిశీలించి అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా తన సిబ్బందితో కలిసి యూరప్ వెళ్లనున్నాడు.