calender_icon.png 1 August, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

29-07-2025 12:47:35 AM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి సర్ఫరాజ్ అహ్మద్ 

కరీంనగర్, జూలై 28 (విజయ క్రాంతి): మండల వ్యవ సాయ, విస్తరణ అధికారులు, సెక్టార్ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎరువుల క్రయవిక్రయాలను ఎప్పటికప్పు డు నమోదు చేసుకొని నివేదిక సమర్పించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి, హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. వర్షాలు కురిసినప్పుడు తరచుగా ముంపునకు గురవుతున్న కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తా, రాంనగర్, జగిత్యాల రోడ్డును సోమవారం ఆయన పరిశీలించారు.

అలాగే గంగాధరలోని ఎరువుల దుకాణాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిసిపల్, రోడ్డు భవనాల శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ముంపు ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డ్రైనేజీల నిర్మాణం, వరద నీరు త్వరగా వెళ్లేందుకు గల మార్గాలను అన్వేషించాలని, అసంపూర్తిగా ఉన్న నాళాలు, కల్వర్టులను పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేక అధికారి వెంట అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్,8 ఇతర జిల్లా అధికారులుఉన్నారు.