10-05-2025 12:15:54 AM
పెబ్బేరులో ప్రారంభించిన ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి
పెబ్బేరు మే 9:మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీరామ ఆగ్రో ఇండస్ట్రీస్‌ను శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జోగులాంబ గద్వాల నియోజకవ ర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ ఇండస్ట్రీస్ లో వ్యవసాయ ఉపకారణమైన వరి కోత యంత్రాలు, రోటవేటర్, కల్టివేటర్, డ్రోన్, పిచికారియంత్రాలు,వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలు, అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
నంద్యాలకు చెందిన కొండారెడ్డి, గద్వాలకు చెందిన దేవేందర్ రెడ్డి, మహబూబ్నగర్ కు చెందిన మహేశ్వర్ రెడ్డి, విజయ భూపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి లు కలిసి సంయుక్తంగా ఈ ఆగ్రో ఇండస్ట్రీస్ ను ఈ ప్రాంత రైతులకోసం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే లు ఇరువురు మాట్లాడుతూ ఈ ఇండస్ట్రీస్లో అన్నదాతలకు కావలసిన అన్ని రకాల యంత్రాలను పనిముట్లను అందుబాటులో ఉంటాయని నియోజకవర్గ పరిధిలోని రైతులు ఈ ఇండస్ట్రీషను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు.
రైతులు అధునాతన వ్యవసాయ పద్ధతులను పాటించాలని అప్పుడే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ ప్రమోదినిరెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కురుమూర్తి, నాయకులు సత్యం, వెంకట్రాములు, దయాకర్ రెడ్డి రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, యుగేందర్ రెడ్డి, గంధం రాజశేఖర్, యాపర్ల రాంరెడ్డి, గుమ్మడం వెంకట్రామిరెడ్డి, వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.