calender_icon.png 11 May, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌డీసీసీబీ పాలకవర్గ సమావేశం

10-05-2025 12:16:21 AM

-పలు అంశాలపై తీర్మానం  

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): నాంపల్లిలోని హైదరాబాద్ సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించి, పలు బ్యాంక్ అంశాలపై తీర్మానం చేశారు.

తీర్మానించిన అంశాలలో డీసీసీబీ నుంచి పీఏసీఎస్‌లకు గోల్‌డలోన్ (క్యాష్ ట్రేడ్స్) కింద వడ్డీరేటు 10.5శాతనం నుంచి 9.5శాతానికి తగ్గించడం ద్వారా రైతులకు మేలు కలుగుతుందని కుర్మ సత్తయ్య పేర్కొన్నరు. నూతన డీసీసీబీ భవన నిర్మాణం, ప్రతిపాదనకై ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కమిటీని ఏర్పాటు చేశారు.

బ్యాంకింగ్, లావాదేవీలపై రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో డైరెక్టర్లు అంజిరెడ్డి, చంద్రశేఖర్, బాల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కిషన్ నాయక్, లక్ష్మారెడ్డి, పోలీస్ రాంరెడ్డి, బూరుకుంట సతీష్, ఆనంద్, శ్యామ్‌సుందర్‌రెడ్డి, మొగులయ్య, మోహన్‌రావు, పీజీవీ రాణి, గుగులోతు సైదా, బ్యాంక్ సీఈవో భాస్కర సుబ్రహ్మణ్యం, జీఎం ప్రభాకర్‌రెడ్డి, డీజీఎం కిరణ్, ఏజీఎం రమాదేవి, ప్రొఫషనల్ డైరెక్టర్ గిరిధర్ పాల్గొన్నారు.