7 June, 2026 | 4:09 PM

Pawan Kalyanను యాక్టర్‌గా "అభిమానిస్తాం.. రాజకీయంగా వ్యతిరేకిస్తాం''

02-06-2026 12:49 PM

హైదరాబాద్: నటుడిగా పవన్ కల్యాణ్(Pawan Kalyan Press Meet) ను అందరం అభిమానిస్తామని టీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar Goud ) అన్నారు. నటుడిగా అభిమానించినప్పటికీ రాజకీయంగా వ్యతిరేకిస్తామని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఆంధ్ర మూలాలు ఉన్న నాయకుడని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏపీకి ఉపముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు.

పవన్ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. గాంధీభవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మహేశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజా పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. మిగిలిన రెండున్నరేళ్లు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

దేశవ్యాప్తంగా తాజా రాజకీయ పరిణామాల కోసం మా విజయక్రాంతి న్యూస్ హోమ్‌పేజీని సందర్శించండి.

ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం 4.30-5.30కు జనసేన అధ్యక్షుడు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా? లేదా? అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. జనసేన సభపై లీగల్ టీమ్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మొత్తానికి పవన్ కళ్యాన్ ప్రెస్ మీట్ పై ఉత్కంఠ నెలకొంది.

ఇలాంటి బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా లేటెస్ట్ న్యూస్ సెక్షన్‌ను ఫాలో అవ్వండి.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌పై ఎందుకు ఉత్కంఠ?

జవాబు: పోలీసుల అనుమతి సందిగ్ధత, టీపీసీసీ విమర్శలు మరియు హైకోర్టు పిటిషన్ కారణంగా ఉత్కంఠ నెలకొంది.

FAQ's

1. పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ ఎక్కడ?

జూబ్లీహిల్స్‌లోని నివాసంలో నిర్వహించాలనుకున్నారు.


2. ఎందుకు ఉత్కంఠ ఉంది?

పోలీసుల అనుమతి, కోర్టు పిటిషన్ కారణంగా.


3. ఎవరు విమర్శించారు?

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్.


4. జనసేన ఏమి చేసింది?

హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

తెలంగాణలో జరుగుతున్న మరిన్ని రాజకీయ వార్తల కోసం తెలంగాణ న్యూస్ చదవండి