7 August, 2026 | 3:29 AM

బాధిత కుటుంబానికి సాయం..

07-08-2026 02:24 AM

చెక్కు అందించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినపల్లి : ఆగస్టు 6 ( విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల బోయినిపల్లి మండలంలోని మానువాడ గ్రామానికి చెందిన అవనిగంటి ఉమేష్ అనారోగ్యంతో బాధపడుతుండగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవతో ఆర్థిక సాయం చెక్కు అందించారు. బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామానికి చెందిన ఊమేష్ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న చొప్పదండి శాసనసభ్యులు డా. మేడిపల్లి సత్యం బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.

కుటుంబ పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్తో ప్రత్యేకంగా మాట్లాడి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు.ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50,000 విలువైన చెక్కును గురువారం బాధితుడు అవనిగంటి ఉమేష్కు ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం అందించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వన్నెల రమణారెడ్డి ,జోగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.