7 August, 2026 | 3:30 AM

భీమన్న సేవలో జోన్-3 డీఐజీ సన్‌ప్రీత్ సింగ్

07-08-2026 02:25 AM

వేములవాడ, ఆగస్టు 6, (విజయ క్రాంతి): వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని జోన్-3 డీఐజీ సన్‌ప్రీత్ సింగ్  గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న డీఐజీకి అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి, వేదమంత్రోచ్చారణల మధ్య ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం స్వామివారి మండపంలో ఆశీర్వచనం అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ డీఈఓ నవీన్ కుమార్ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని డీఐజీకి అందజేశారు. అనంతరం డీఐజీ స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్, ఏఈఓలు జయకుమారి, ఎన్. మహేష్, పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, పి. శ్రీనివాస్, ఎన్ నరేందర్, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.