23-01-2026 09:53:37 PM
నారాయణపేట,(విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఈనెల 25 నుండి 28 తేదీలలో జరుగు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపియం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామారెడ్డి, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సమ్రీన్, రాజేశ్వరి తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సంఘం నాయకురాళ్ళతో కలిసి మహాసభల పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయన్నారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలపై పోరాడాలన్నారు. ఇట్టి మహాసభలలో మహిళలు ఎదుర్కొంటున్న ఆర్ధిక, సమాజిక వివక్ష తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపుందించుకోవడం జరుగుతుందన్నారు.