23-01-2026 09:29:26 PM
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): పంచాయతీ నుండి జిహెచ్ఎంసి లో విలీనమైన తర్వాత కంజర్వేషన్ జోన్లు రైతులకు శాపంగా మారాయని హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దుండిగల్ సర్కిల్ బీజేపీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై బౌరంపేట్ లో రైతు సమాదుండిగల్ సర్కిల్ బీజేపీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై బౌరంపేట్ లో రైతు సమావేశం నిర్వహించారు. దుండిగల్ సర్కిల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండారి దత్తాత్రేయ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కంజర్వేషన్ జోన్లు మల్టిజోన్ కు మార్చే వరకు మీ వెంట నేనుంటానంటూ రైతులకు భరోసానిచ్చారు. సామాన్య చిన్న రైతులే ఇందులో ఉన్నారని, వారికి జరిగే నష్టం అపారమైనది. కావున రైతుల నుండి ముఖ్యమంత్రికి ఇవ్వడానికి వినతి పత్రాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశం తరువాత త్వరలో ముఖ్యమంత్రిని వివిధ సమస్యలపై కలిసి విన్నవించి కచ్చితమైన పరిష్కారం కోరుతానని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు.
లేని యెడల 50 వేల మంది రైతులతో కలిసి ఉద్యమ రూపంలో ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ఇంచార్జి, బౌరంపేట్ మాజీ సర్పంచ్ లు డా ఎస్ మల్లారెడ్డి,అర్కల వీరేశం గౌడ్, కొమ్ము మంగమ్మ, మాజీ ఎంపీటీసీలు ఎస్ జంగారెడ్డి,జిల్లా ప్రధానకార్యదర్శి డి. విగ్నేశ్వర్ చారీ,సీనియర్ నాయకులు నల్ల రామచంద్రరెడ్డి, డి. ప్రభాకర్ రెడ్డి,సరిగారీ సత్తిరెడ్డి,ఆకుల సత్యనారాయణ, పి. మాధవరెడ్డి,ఆకుల మల్లేష్,మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు దమ్మగారి సీతారాంరెడ్డి, తురాయి భానుగౌడ్, నాయకులు ఆర్ నర్సింహా చారి,ఆకుల విజయ్,యశ్వంత్, చిన్న,తలారి రాజ్ కుమార్, నామాల శ్రీకాంత్, విష్ణు, రైతులు పాల్గొన్నారు.