23-01-2026 09:47:13 PM
సిద్దిపేట క్రైం: రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. అర్రైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో భాగంగా అరవింద్ పటేల్ మేనేజర్ దేశాయ్ బీడీ కంపెనీ కార్మికులు, ఉద్యోగులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు మాట్లాడారు.
ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్, ఫోర్ వీలర్ నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని హితవు పలికారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుపడితే రూ.10 వేలు జరిమానా చెల్లించాలని, రెండోసారి పట్టుబడితే జైలు శిక్ష కూడా విధించబడుతుందని చెప్పారు. ఒక రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కృంగదీస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. అనంతరం రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు.