calender_icon.png 23 January, 2026 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ కరెన్సీ చలామణిపై ఉక్కుపాదం

23-01-2026 09:20:40 PM

ఇప్పటికే 10 మందిపై పీడీ యాక్ట్ చర్యలు

మరో కీలక నిందితుడిపై పిడి యాక్ట్ అమలు

జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి జరుగుతున్న ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న మూటపై కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉక్కు పాదం మోపుతున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా నకిలీ నోట్లను తయారు చేస్తున్న మూటను 500 రూపాయల నకిలీ నోటుతో ప్రారంభమైన పరిశోధన 14 మంది నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. ఫేక్ కరెన్సీతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే కుట్రలో భాగమైన బొకస్ కరెన్సీ ఉత్పత్తి పంపిణీ వ్యవస్థలను చిన్న భిన్నం చేసే వారిని వదిలేది లేదన్నారు.

చట్ట పరిధిలో పట్టుకొని శిక్షించడం జరుగుతుందని హెచ్చరించారు. యువత ఈజీ మనకి అలవాటు పడకూడదని హితవు పలికారు. కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్ల తయారీ చలామణిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఈ చర్యలలో భాగంగా, అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠాకు సంబంధించిన మరో కీలక నిందితుడిపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ శుక్రవారం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వైన్స్ షాప్‌లో రెండు నకిలీ ₹500 నోట్లను వినియోగించిన ఘటనకు సంబంధించి Cr.No.551/2025, U/s 179, 318(4) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా జిల్లా పోలీసులు తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 14 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే సౌరవ్ దే, హరి నారాయణ్ భగత్ @ సంజయ్, ఇబ్నుల్ రషీద్, లఖన్ కుమార్ దూబే, దివాకర్ @ దివాకర్ చౌదరి @ బ్రిజేష్ కుమార్ గుప్తా, సత్యదేవ్ యాదవ్, శివం శర్మ @ ప్రమోద్ చన్నులాల్ కాట్రే, నంద్లాల్ జంగ్డే, మన్హరన్ లహరే అనే 9 మంది నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరిగిందన్నారు.

ఇదే కేసులో మరో కీలక నిందితుడు 

ఛత్ రామ్ ఆదిత్య, నివాసం: దేవగావ్, జంజ్‌గిర్-చంపా జిల్లా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పై పి డి యాక్ట్ అమలు చేయడం జరిగింది. పై నిందితుడు ప్రస్తుతం నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్నారు. జిల్లా కలెక్టర్, కామారెడ్డి జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను శుక్రవారం కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ  నరహరి, హెడ్ కానిస్టేబుల్ వి.ఎల్. నర్సింలు అధికారికంగా అందజేశారు. నకిలీ కరెన్సీ చలామణి ద్వారా ప్రజల్లో భయం, ఆర్థిక అస్థిరత సృష్టించే వారిని అరికట్టడంలో పీడీ యాక్ట్ కీలకమైన చట్టమని జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర,   తెలిపారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం నిందితులు ఒక సంవత్సరం పాటు బెయిల్ లేకుండా జైల్లోనే నిర్బంధంలో ఉండనున్నారు. ఇటువంటి తీవ్రమైన ఆర్థిక నేరాలపై ఎటువంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర,  మాట్లాడుతూ... నకిలీ నోట్ల ముఠాలు అమాయక ప్రజలను మోసం చేయడమే కాకుండా దేశ ఆర్థిక భద్రతకు ముప్పుగా మారుతాయి. ఇలాంటి ఆర్థిక నేరాలపై కామారెడ్డి జిల్లా పోలీసులు ఎలాంటి సడలింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కరెన్సీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని అన్నారు.