calender_icon.png 23 January, 2026 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత దేశ సంస్కృతి, సంప్రదాయాలు కపాడాలి

23-01-2026 10:06:57 PM

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఇ.వి శ్రీనివాస్ రావు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ సుబేదారి వడ్డేపల్లి లోని పల్ల రవీందర్ రెడ్డి భవన్ లో మై భారత్ వరంగల్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతరాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. కర్ణాటక కు చెందిన యువతి, యువకులు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించి,

వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవడంతో పాటు యువత మధ్య పరస్పర అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఇ.వి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ భారత్ వివిధ రాష్ట్రాల సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలతో సమృద్ధిగా ఉందని, ఇలాంటి యువజన మార్పిడి కార్యక్రమాలు దేశ సమైక్యత, జాతీయ ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని, యువత దేశ భవిష్యత్తు అని సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మై భారత్ వరంగల్ ఉపసంచాలకులు చింతల అన్వేష్, వాలంటరీలు సురేష్, నరేష్, కర్ణాటక రాష్ట్ర యువజన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.