23-01-2026 09:26:54 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగాడిమద్దికుంట గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్బంగా శుక్రవారం ఆలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు,ముదిరాజ్ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యే విజయ రమణారావు కు శాలువా కప్పి , పూలమాల తో ఘనంగా సన్మానించారు.