మట్టి మాఫియాతో అల్లాడుతున్న అయిజ
అయిజ, జూన్ 3: అయిజ మున్సిపాలిటీలో జోరు అందుకున్న మట్టి మాఫియా నిద్రమత్తులో అధికార యంత్రాంగం. రాత్రి అయిందంటే చాలు ట్రాక్టర్లు, ట్రిప్పర్లు ఎర్రమట్టి ఇసుక మొదలగు వాహనాల హోరుతో స్థానిక జనవాసాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూన్నాయని ప్రజల బెంబేలెత్తుతున్నారు.
అసలు వాటికి అనుమతులు ఉన్నాయా ?నిజంగా అధికారుల అనుమతులు ఉంటే? రాత్రి మాత్రమే ఎందుకు తిరుగుతున్నాయి ? ఇట్టి దందా అధికారుల కనుసన్న లోనే జరుగుతున్నాయా ? లేక మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అన్న ధీమాతో మట్టి మాఫియా బరితెగించిందా ? ఒకవేళ అధికారుల అనుమతి లేకపోతే మైనింగ్ అధికారుల పర్యవేక్షణ కరువైందా ? అంటూ సవాలక్ష ప్రశ్నలతో ప్రజల మదిని వేధిస్తున్నాయి. రాత్రిపూట ట్రిప్పర్లు తిరగడంతో విద్యుత్తు తీగలను తాకుతూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
అంతేగాక ట్రిప్పర్ల భారీ వాహనాల బరువుతో నాసిరకంగా ఉన్న కల్వర్టులు కూలిపోయి రోడ్లు నాశనం అవుతున్నాయి. ఇంతకుముందు మెయిన్ రోడ్లలో తిరుగే మట్టి ట్రిప్పర్లు ఇప్పుడు చిన్న చిన్న గల్లీలో కూడా తిరగడం మొదలుపెట్టాయి. దానివల్ల అంతర్గత రోడ్లు దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
మున్సిపాలిటీలోని గతంలో దెబ్బతిన్న రోడ్లను పునర్నిర్మాణం చేపట్టే దిక్కు లేదని దానికి తోడు కొత్తగా ఈ ట్రిప్పర్ల ద్వారా నాశనం అవుతున్న రోడ్లు తోడైతున్నాయని మట్టి మాఫియా తమ స్వార్థం కోసం రోడ్లు ఏమైనా పరవాలేదు అనే ధీమాతో తిరుగుతున్నాయని వీటిని అరికట్టే అధికారి లేడా ? అని ప్రజల తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళితవాడకు వెళ్లే ప్రధాన రహదారి డాక్టర్ సుబ్బయ్య ఇంటి పక్కన మూలమలుపులో సుమారు 7, 8 సంవత్సరాల క్రితం పగిలిన రోడ్డు వాహనాల రాకపోకలకు ఇబ్బందులుగా ఉన్న దానిని ఇంతవరకు పట్టించుకున్న నాధుడు లేదని మరియు నిన్న రాత్రి దళితవాడలో ఎర్రమట్టితో భారీ ట్రిప్పర్లు తిరగడం వలన కల్వర్టు ద్వంసమై దారులు నాశనమయ్యాయని స్థానికులు ఎస్త్స్ర కి సమాచారం ఇవ్వగా సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంటనే వచ్చి అట్టి ఘటన స్థలాన్ని పరిశీలించి దీనికి కారణమైన ట్రిప్పర్ను తెలుసుకొని అనుమతులు లేకుంటే అట్టి వాహనంపై తప్పకుండా కేసు నమోదు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించడం జరిగింది. ఏది ఏమైనా మైనింగ్ అధికారులు ఇట్టి నిర్లక్ష్య వైఖరిని విడాలని లేకపోతే రహదారులు దెబ్బతినడమే కాకుండా ప్రజలకు ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.






