4 June, 2026 | 1:13 AM

ఘనంగా హరీశ్‌రావు జన్మదిన వేడుకలు

04-06-2026 12:05 AM
  1. దాచారం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.2లక్షల విరాళం 
  2. మృత కార్యకర్తల కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థిక సాయం

గజ్వేల్, జూన్ ౩: బీఆర్‌ఎస్ శాసనసభ పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు గజ్వేల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి  ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని గజ్వేల్ మం డలంలోని దాచారం గ్రామ వెంకటేశ్వర స్వా మి దేవాలయ పునర్నిర్మాణానికి బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి రూ.2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి రూ. 25వేల విరాళం చెక్కును అందజేశారు. నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తర్వాత గజ్వేల్ పట్టణంలోని మాతా-శిశు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, కౌన్సిలర్లతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అలాగే ఇందిరా పార్క్  చౌరస్తాలో అన్నదా న కార్యక్రమం నిర్వహించగా, ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో కూడా కేక్ కట్ చేసి సం బరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజక వర్గంలో ఇటీవల మృతి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఒక్క కుటుంబానికి రూ.లక్ష చొప్పున  ఆర్థిక సహాయం అందజేశారు. కోమటిబండ  భాస్కర్, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ సుమన్,  ములుగు మాజీ ఎంపీటీసీ ప్రవీణ్  కాశిరెడ్డిపల్లి ఎల్లయ్య  కుటుం బాలకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున సాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, హరీష్ రావు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో తెలంగా ణ రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. తె లంగాణ రాజకీయాల్లో హరీష్ రావు సేవలు విశేషమని కొనియాడారు. గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 350 మందికి పైగా బీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు గతంలో పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. బీఆర్‌ఎస్ పా ర్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, భవిష్యత్తులో కూడా కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, సిద్దిపేట జిల్లా చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, గజ్వే ల్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర వైస్ ఎంపీపీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.