10-09-2025 10:16:48 PM
మిడ్జిల్: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను మిడ్జిల్ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులోని దుందుభి వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు మిడ్జిల్ పోలీసులకు సమాచారం అందించారు, విషయం తెలుసుకున్న పోలీసులు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్ ను విచారించగా ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపారు.