12 July, 2026 | 4:14 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై ఆగిన విమానం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

06-04-2026 12:13 PM

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో(Rajiv Gandhi International Airport) విమానం రన్‌వేపై ఆగిపోయింది. రాయపూర్‌ వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా రన్‌వేపై నిలిచిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. విమానం ఆగిపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కావాల్సిన 2 విమానాలు గాల్లో చక్కర్లు కొట్టగా, టేక్‌ ఆఫ్‌ కావాల్సిన మరో మూడు విమానాలు ఆలస్యం అయ్యాయని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.