calender_icon.png 16 August, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి ఏకమవుదాం

05-12-2024 04:54:32 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఏకమవుదామని రాయి సెంటర్ అధ్యక్షుడు కోర్కెట జ్ఞానేశ్వర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాసి సెంటర్ లో ఆదివాసి సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈనెల 7న జిల్లా కేంద్రంలోని రాయి సెంటర్లో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆదివాసీల సమస్యలు సంక్షేమం అభివృద్ధి పై చర్చించడంతోపాటు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని తమ సమస్యలను విన్నవించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే సమావేశానికి అన్ని సంఘాల నాయకులు ,ఆదివాసీలు రావాలని కోరారు. సమావేశంలో చర్చించిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.