25 July, 2026 | 2:49 AM

విద్యార్థి సమస్యలపై సీఎం శవయాత్ర

25-07-2026 02:16 AM

వనపర్తి టౌన్, జూలై 24 : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటిం చాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరూపానికి శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ దేవర్ల కార్తీక్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.