calender_icon.png 4 November, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫుట్‌బాల్‌కు అఖిలేష్ ఎంపిక

03-11-2025 03:02:27 AM

కొత్తపల్లి, నవంబర్2(విజయక్రాంతి):కరీంనగర్ లోని ఆల్ఫోర్స్ హైస్కూల్లో చదువు తున్న గాండ్ల అఖిలేష్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి అండర్ 17 ఫుట్ బాల్ గేమ్ సెలక్షన్లో ఎంపికయ్యారు. ఫుట్ బాల్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన నేపథ్యంలో సెలెక్ట్ చేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ సెలక్షన్ లో ఫుట్ బాల్ ఆడారు. ఎవరైతే చాకచక్యంగా గోల్ చేసి ప్రతిభ కనబరిచిన వారిని సెలెక్ట్ చేశారు. అందులో భాగంగానే అఖిలేష్ ను సెలెక్ట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తర్వాత జోనల్ లెవెల్ సెలక్షన్స్ ఉంటాయని అక్కడ ఎవరైతే ప్రతిభను కనబరుస్తారో వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని ఫెడరేషన్ సభ్యులు చెప్పారు. సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ని ఫెడరేషన్ సభ్యులుఅభినందించారు.