calender_icon.png 4 November, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ మహాశక్తి దేవాలయంలో వైభవంగా తులసీ దామోదర కల్యాణం

03-11-2025 03:04:19 AM

ముకరంపురా, నవంబర్2(విజయక్రాంతి):పవిత్ర కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి  పురస్కరించుకుని ఆదివారం రోజున సాయంత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ తులసి దామోదర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ  విద్యారణ్య భారతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఆలయ వేద పండితులు శాస్రోత్తకంగా, వేద మంత్రోచ్ఛారణలతో   తులసి దామోదర కళ్యాణ మహోత్సవం నిర్వహించగా,

కన్నుల పండుగగా సాగింది. వేడుకల్లో పాల్గొన్న అశేష మహిళా భక్తులు తులసి, ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేపట్టి, దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలోని క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించే తులసి దామోదర కళ్యాణం సంతానాభివృద్ది, ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని ప్రసాదిస్తుందని ఇక్కడి వచ్చే మహిళా భక్తుల విశ్వాసం.కళ్యాణం సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులకు ఆశీర్వచనం అందించి, పెళ్లి తలంబ్రాలను భక్తులకుఇచ్చారు.