calender_icon.png 4 November, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బస్సు

04-11-2025 10:09:35 AM

మానకొండూర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట శివారులో వడ్ల బస్తాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను హైదరాబాద్ నుండి మెట్పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ లోడుతో సహా రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.

తిమ్మాపూర్ మండలం నేదునూరు ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి బస్తాలు లోడ్ చేసుకొని రైస్ మిల్లుకు తరలిస్తుండగా బస్సు ఢీకొన్నది. సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్, సీఐ సదన్ కుమార్ పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల తరచూ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరుగుతున్న నేపథ్యంలో తిమ్మాపూర్ లో మరో ప్రమాదం జరగడం సంచలనం సృష్టించింది.

బండి దిగ్భ్రాంతి

తిమ్మాపూర్ బస్సు ట్రాక్టర్ ప్రమాదంపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మణిపూర్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి విషయం తెలిసిన వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, తిమ్మాపూర్ పోలీసులతో మాట్లాడి సంఘటన పై అరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలపట్ల బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణీకుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారించాలని కోరారు.