04-11-2025 10:12:10 AM
							హుజురాబాద్,(విజయక్రాంతి): అర్ధరాత్రి కారు విధ్వంసం సృష్టించిన సంఘటన కరీంనగర్ జిల్లా(Karimnagar District) శంకరపట్నంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట ఇందిరానగర్ కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన పని నిమిత్తం కరీంనగర్ కువెళ్లి తిరిగి వస్తుండగా కారు అర్ధరాత్రి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న స్వీట్ షాప్ లోకి దూసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనం,స్వీట్ షాప్, విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయినట్లు తెలిపారు. కేశపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి కారును పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు తెలిపారు. షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.