03-11-2025 03:01:55 AM
ఐఐఎంసీ కళాశాలలో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, ఐఐఎంసి కళాశాల సం యుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న ‘తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమం‘ 13 సమావేశాన్ని ఆదివారం కమలాకర లలిత కళాభారతి సంస్థతో కలిసి లకిడికాపూల్‌లోని ఐఐఎంసి కళాశాలలో నిర్వహించారు. యువభారతి వ్యవస్థా పక సమావేశకర్త, కళాశాల చైర్మన్ వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ.. ఇప్పటివరకు మొత్తం 38 సంస్థలు మాతో కలిసి తెలుగు వెలుగు కార్యక్రమాలను నిర్వహించడానికి ముందుకు వచ్చాయని తెలిపారు.
సమావేశకర్తలుగా సాధన నరసింహా చార్య, కె.వి.ఎన్. ఆచార్యలను నియమిస్తూ సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి ఆచార్య ఫణీంద్ర రచించిన ‘భారత భారతి‘, డా.కె.వి.కృష్ణ కుమారి రచించిన భద్రా కల్యాణం (42వ ముద్రణ) గ్రంథాలను ఆవిష్కరించారు. ‘భారత భారతి‘ గ్రంథంను ఫణీంద్ర దంపతులచేతుల మీదు గా ఆచార్య వి.విశ్వనాథంకు అంకితమిచ్చా రు. ప్రముఖ రచయిత్రి డా.కె.వి. కృష్ణ కుమా రి మాట్లాడుతూ భద్రా కల్యాణం ముద్రించడానికి ప్రధాన కారణం కృష్ణ పరమాత్ముడే అన్నారు.
భారత భారతి గ్రంథ కర్త ఫణీంద్ర స్పందిస్తూ ఈ గ్రంథం రాయడానికి సినారె రాసిన మందార మకరందాలు ప్రేరణ అన్నారు. కార్యక్రమంలో యువభారతి ప్రధాన సంపాదకులు డా.బి.జయరాములు, సాహితీ శాస్త్రవేత్త వి.ఎస్.ఆర్.మూర్తి, కమలాకర లలిత కళా భారతి వ్యవస్థాపక అధ్యక్షు రాలు భారతీ కమలాకర్, కళాశాల ప్రాచార్యులు కూర రఘువీర్, యువభారతి కార్య దర్శి జీడిగుంట వెంకట్రావు, సభ్యులు అమా తి రవీంద్ర, నారాయణ రెడ్డి, వాసవి ఫౌండేషన్ సహా చైర్మన్ చంద్రయ్య, కళాశాల తెలు గు శాఖ అధ్యక్షులు ఇ.రామకృష్ణ, యువభారతి యూట్యూబ్ ఛానల్ ప్రసార కర్త శ్యాం సుందర్ పాల్గొన్నారు.