అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి
టీఎస్ యుటిఎఫ్ గండీడ్ మండల శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి డిమాండ్
గండీడ్ : మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) విద్యాశాఖ కార్యాలయం నుండి వెలుబడుతున్న అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, బీ.ఈడీ. కళాశాలకు, డైట్ కళాశాలకు మరియు మెడికల్ గ్రౌండ్స్ పేరుతో జిల్లా వ్యాప్తంగా అక్రమ డిప్యూటేషన్ లో బదిలీలకు పాల్పడం సరైన చర్య కాదని గతంలో బీఈడీ డైట్ కళాశాలలకు కొంతమంది టీచర్లకు డిప్యూటేషన్లు ఇచ్చారు. మౌఖిక ఆదేశాలతో మరికొంతమంది డిప్యూటేషన్లలో పనిచేస్తున్నారు.
వర్క్ అడ్జస్ట్మెంట్ లో కూడా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కాకుండా ఉపాధ్యాయుల స్వార్థం కోసం వారికి అనుకూలమైన స్థలాలకు వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారు. మానవత హృదయంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న టీచర్లకు మేలు చేయాల్సింది పోయి డిప్యూటేషన్ ముసుగులో జిల్లా విద్యాధికారి అక్రమార్కులకు డిప్యూటేషన్ బదిలీలను ఇస్తున్నారని, అటువంటి వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అక్రమ చర్యలపై ఆందోళన చేపడుతామని టి. ఎస్. యు.టి.ఎఫ్. గండీడ్ మండల శాఖ అధ్యక్షులు గంట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, సీనియర్ నాయకులు రవిబాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.






