calender_icon.png 4 November, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశాఖ, అల్లూరి జిల్లాల్లో భూప్రకంపనలు

04-11-2025 08:42:03 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో(Alluri Sitharama Raju district) మంగళవారం ఉదయం 3.7 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. పొరుగున ఉన్న విశాఖపట్నం జిల్లాలో కూడా ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(Andhra Pradesh State Disaster Management Authority) ప్రకారం, ఉదయం 4:19 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం నమోదైంది. దీని కేంద్రం అక్షాంశం 18.02N, రేఖాంశం 82.58E వద్ద ఉంది. మంగళవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైందని, వైజాగ్‌లోని కొన్ని చోట్ల ప్రకంపనలు సంభవించాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) అధికారి మీడియాతో అన్నారు. ఆరిలోవ, అడివివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బి కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, సింహాచలం, పెందుర్తి ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం ధాటికి పెద్ద శబ్దం రావడంతో ఇళ్ల నుంచి బయటకు ప్రజలు పరుగులు తీశారు.  ఏపీలో మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల భారీ కురిసిన విషయం తెలిసిందే.