calender_icon.png 12 October, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్

12-10-2025 07:05:15 PM

ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్

మేడిపల్లి (విజయక్రాంతి): మేడిపల్లిలోని వినాయక్ నగర్ లో ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవ సందర్భంగా శనివారం రాత్రి అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ 'అలయ్ బలయ్' కార్యక్రమం, సంస్కృతీ సాంప్రదాయ సమ్మేళనం, సామరస్యనికి, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, ఐక్యతను చాటిచెప్పే గొప్ప వేదిక 'అలయ్ బలయ్' కార్యక్రమం, రాజకీయ, కుల, మత విభేదాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.

అలయ్ బలయ్' అనేది కేవలం ఒక పండుగ వేడుక మాత్రమే కాదు, 'సమాజంలో సామరస్యం, ఐక్యత, సోదరభావం' అనే గొప్ప సందేశాన్ని ప్రతి ఏటా చాటిచెప్పే తెలంగాణ ఆత్మగా దీన్ని అభివర్ణిస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక మాజీ కార్పొరేటర్ పాశం శశిరేఖ బుచ్చి యాదవ్, పిర్జాదిగూడ మాజీ కార్పొరేటర్లు, ఆదర్శ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మేడ బోయిన విజయ్ కుమార్, పోలీస్ తిరుపతిరెడ్డి, బాడిశెట్టి ఎల్లయ్య, తునికి కోటయ్య, రావుల మధుసూదన్, మంగళారపు శ్రీనాథ్, పోలీస్ సురేందర్ రెడ్డి, గడ్డం రాజు, కడారి శేఖర్, గొడిశాల రఘు, లగ్గాని సోమేశ్ గౌడ్, స్నానం చెర్ల శ్రీనివాస్, గడ్డం పరమేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.