calender_icon.png 12 October, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామ్రేడ్ వల్లాస్ లింగయ్య ఆశయాలు నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి

12-10-2025 07:08:13 PM

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు

పెన్ పహాడ్: మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన ప్రజా కళాకారుడు, ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ వల్దాస్ లింగయ్య ఆరోగ్యంతో శనివారం మృతిచెందారు. ఈ మేరకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు విచ్చేసి మృతుడు లింగయ్య పార్థిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా లింగయ్య మృతదేహాన్ని సిపిఎం నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాసంఘాల నాయకులు, అధికారులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని లింగయ్య అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నెమ్మాది మాట్లాడుతూ.. నిరుపేద ఓ దళిత కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే కమ్యూనిస్టు పార్టీ చేసే ప్రజా పోరాటాలకు ప్రజానాట్యమండలిలో చేరి విద్యార్థి యువజన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మృతుడు లింగయ్య చేసిన సేవలపై ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ధర్మాపురం ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి, ధనియాకుల శ్రీకాంత్,  ఏల్పుల వెంకన్న, మాజీ ఎంపిటిసి నెమ్మది లక్ష్మి, శాఖ కమిటీ సభ్యులు నెమ్మాది లింగయ్య, సైదులు, సోమయ్య, వెంకులు తదితరులు ఉన్నారు.