13 July, 2026 | 9:40 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

చరిత్ర సృష్టించిన అల్కరాజ్

02-02-2026 12:00 AM
  1. ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం
  2.   22 ఏళ్లకే కెరీర్ గ్రాండ్‌శ్లామ్ పూర్తి
  3. జకోవిచ్‌కు మళ్లీ నిరాశే

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 1 : వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్, స్పెయిన్ సంచలనం కార్లోక్ అల్కరాజ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల టెన్నిస్‌లో కెరీర్ గ్రాండ్‌శ్లామ్ పూర్తి చేసి న అతిపిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్, మాజీ వర ల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌ను ఓడించాడు. ఆసక్తికరంగా సాగిన టైటిల్ పోరులో 2-6, 6-2, 6-3, 7-5 స్కోరుతో ఆరో సీడ్ జకోవిచ్‌ను నిలువరించాడు.

త ద్వారా కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపె న్ విజేతగా నిలిచాడు. అంతేకాకుండా 22 ఏళ్లకే కెరీర్ గ్రాండ్‌శ్లామ్ (నాలుగు గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్) పూర్తి చేసిన ఆటగాడిగా నిలి చాడు. అల్కరాజ్ ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ (2024, 2025), వింబుల్డన్(2023, 2024), యూ ఎస్ ఓపెన్(2022, 2025) టైటిల్స్ గెలుచుకున్నాడు.

ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా సాధించి కెరీర్ గ్రాండ్‌శ్లామ్ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 25వ గ్రాండ్‌శ్లామ్ గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న జకో విచ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇదిలా ఉంటే 22 ఏళ్ల 272 రోజల వయసులో కెరీర్ గ్రాండ్‌శ్లామ్ పూర్తి చేసుకోవడం ద్వారా 1962లో రాడ్ లావర్ రికార్డును బద్దలుకొట్టాడు.