13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

సెమీఫైనల్లో భారత్

02-02-2026 12:00 AM
  1. కుర్రాళ్ల దెబ్బకు పాక్ ఔట్
  2. అండర్ 19 ప్రపంచకప్

అండర్ 19 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్ భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించిం ది. బ్యాటింగ్‌లో తడబడి నిలబడిన భారత కుర్రాళ్లు బౌలింగ్‌లో అదరగొట్టి పాక్‌ను ఇంటికి పంపించారు. ఒక దశలో పాక్ గెలిచేలా కనిపించినా అద్భుతంగా పుంజుకున్న భారత యువ బౌలర్లు వరుస వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ అండర్ 19 జట్టు 252 పరుగులకు ఆలౌటైంది.

47 పరుగుల 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను వేదాంత్, విహాన్ ఆదుకున్నారు. వేదాంత్ త్రివేది (68), కవిష్క చౌహాన్(35), వైభవ్ సూర్యవంశీ (30) పరుగులతో రాణించారు. ఛేజిం గ్‌లో కాస్త దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ యువ జట్టు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మూల్యం చెల్లించుకుంది. మిడిల్ ఓవర్స్‌లో భారత్ బౌలర్లను తక్కువ అంచనా వేసి దె బ్బతింది.  మన బౌలర్లు పాక్ జట్టును 194 పరుగులకే ఆలౌట్ చేశారు. బ్యాటింగ్‌లో విఫలమైన కెప్టెన్ ఆయుశ్ మాత్రే 3 వికెట్లు తీయగా.. ఖియగా పటేల్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. సెమీఫైనల్లో భారత్ , ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది.