13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ

02-02-2026 12:00 AM

పాకిస్థాన్ కీలక నిర్ణయం

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 1 : టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగాటోర్నీలో భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటిం చింది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్ ఆడొద్దని పాకిస్థాన్ ప్రభుత్వం తమ క్రికెట్ జట్టును ఆదేశించింది. దీంతో తమ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీమిండియాతో మ్యాచ్ ఆడడం లేదని పాక్ బోర్డు తెలిపింది. టోర్నీ లో మిగిలిన మ్యాచ్ లు ఆడతామని వెల్లడించింది. ఐసీసీ ద్వంద్వ వైఖరి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ పాక్ బోర్డు చెబుతోంది.

నిజానికి పాక్ బోర్డు వైఖరి మొ దటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. తమ కు సంబంధం లేని వ్యవహారంలో జోక్యం చేసుకున్న పీసీబీ బంగ్లాదేశ్‌కు మద్ధతుగా నిలిచింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా ముస్తాఫిజుర్ రహమా న్‌ను ఐపీఎల్ నుంచి తప్పించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోగా.. వారి స్థా నంలో స్కాట్లాండ్‌కు అవకాశం వచ్చింది. అయితే బంగ్లా మ్యాచ్‌లు కొలంబోలో నిర్వహించాలంటూ పాక్ బోర్డు హడావుడి చేయడం విమర్శలకు దారితీసింది.

ఒకదశలో బంగ్లాకు మద్ధతుగా టోర్నీని బ హిష్కరించాలంటూ ఆలోచన చేసినా  వెనక్కి తగ్గింది. ఇప్పుడు తమ ప్రభుత్వంతో చర్చించి టీమిండియాతో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే పాకిస్తాన్ నిర్ణయంతో భారత్ కు మ్యాచ్ ఆడకుండానే 2 పాయింట్లు రానున్నాయి. ప్రస్తుతం లీగ్ స్టేజ్ మ్యాచ్ కావ డంతో పెద్దగా ప్రభావం ఉండదు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ లేదా ఫైనల్స్ లో భారత్ తో ఆడాల్సి వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.