calender_icon.png 10 December, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాల తనిఖీల్లో పట్టుబడిన మద్యం

10-12-2025 11:43:07 AM

ఎల్లారెడ్డి:(విజయక్రాంతి): అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఫ్లయింగ్ స్కాడ్ టీం మంగళవారం సాయంతరం మల్లయ్యపల్లి గేటు వద్ద FST టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా, పట్టుబడినట్లు ప్లయింగ్,స్కాడ్ టీం, అధికారి ఆర్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పాత లింగయ్య పల్లి గ్రామానికి చెందిన చింతకాయల రమేష్ అనే వ్యక్తి తన ఆటో నెంబర్ TS 35 T 6506 గల ప్యాసింజర్ ఆటోలో మద్యం తీసుకుపోతుండగా మూడు కాటన్ల మద్యం (25 లీటర్లు విలువ 28000/-)పట్టుకొని సీజ్ చేసి అట్టి ఆటో, మద్యం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో అప్పగించి దరఖాస్తు ఇవ్వగా ఎల్లారెడ్డి పోలీసులు  కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.