calender_icon.png 10 December, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వప్న హాస్పిటల్ లో అరుదైన వైద్య చికిత్సలు

10-12-2025 11:39:39 AM

ప్రాణపాయస్థితిలో ఉన్న ముగ్గురికివైద్యం

నిర్మల్,(విజయక్రాంతి): ​నిర్మల్ పట్టణంలోని స్వప్న సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ (Swapna Super Specialist Hospital), క్లిష్టమైన వైద్య సవాళ్లను ఎదుర్కొని మరో మూడు కేసుల్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. నిస్సహాయ స్థితిలో వచ్చిన ముగ్గురు రోగులకు ఉన్నత స్థాయి శస్త్రచికిత్సలు చేసి, వారికి పూర్తి ఆరోగ్యాన్ని కాపాడినట్టు వైద్యులు  నాలం స్వప్న శశికాంత్ తెలిపారు మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు.

​హై-రిస్క్ వృద్ధురాలికి వెన్నెముక సర్జరీ

​అదిలాబాద్‌కు చెందిన అన్వరి బేగం అనే మహిళ ప్రమాదవశాత్తు కుడి భుజం మరియు కుడి తుంటి భాగంలో ఫ్రాక్చర్‌తో పాటు MRIలో వెన్నెముకలోని కొంత భాగం విరిగినట్లుగా గుర్తించారు. అయితే, ఆమెకు ఉన్న అధిక రక్తపోటు (High BP), అధిక చక్కెర (High Sugar), మరియు గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆదిలాబాద్‌లో కానీ, మహారాష్ట్రలోని యావత్మాల్‌లో కానీ ఎటువంటి శస్త్రచికిత్స అందించలేకపోయారు. వారు నిర్మల్ పట్టణంలోని స్వప్న సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించగా, డాక్టర్ నాలం శశికాంత్ (జనరల్ సర్జన్), డాక్టర్ సచిన్ బాబు బీరధర్ (నరాలు మరియు వెన్నుపూస వైద్యులు), డాక్టర్ రాహుల్ (జనరల్ మెడిసిన్), మరియు డాక్టర్ నిఖిల్ (మత్తు వైద్యులు) బృందం ఆమె అధిక షుగర్, బీపీని నియంత్రించి, కేవలం 90 నిమిషాలలో ఆరు స్క్రూలను ఉపయోగించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

మాట కోల్పోయిన యువకుడికి మెదడు సర్జరీ

​25 సంవత్సరాలు గల రాకేష్ అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయం అయి, వేరే హాస్పిటల్ లో చికిత్స అందించినా ఉపయోగం లేకపోవడమే కాకుండా, మాటను కూడా కోల్పోయాడు. ఇతనిని స్వప్న హాస్పిటల్‌కు తీసుకురాగా, ఇక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మెదడులో తీవ్రమైన రక్తస్రావం (Bleeding) అవుతున్నట్లు గుర్తించి వెంటనే శాస్త్ర చికిత్స నిర్వహించారు. స్వప్న హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశికాంత్ నాలం (జనరల్ సర్జన్), డాక్టర్ సచిన్ బీదర్ (నరాలు మరియు వెన్నుపూస వైద్యులు), డాక్టర్ నిఖిల్ (మత్తు వైద్యులు) బృందం చేసిన శస్త్రచికిత్స అనంతరం రాకేష్ కోలుకొని, మాట తిరిగి రావడం జరిగింది. ఆరు రోజుల్లోనే అతడిని ఇంటికి పంపించడం జరిగింది.

​కాంప్లెక్స్ బ్రెయిన్ ట్యూమర్ విజయవంతమైన తొలగింపు

​బోథ్ మండల్, కిష్టాపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ అనే వ్యక్తికి వాంతులు, ఫిట్స్, నోరు తూందర పోవడం, తలనొప్పి ఉండడం వలన MRI స్కాన్ చేయగా మెదడులో ట్యూమర్ (గడ్డ) తయారైందని రిపోర్ట్‌లో వచ్చింది. ఇటువంటి మెదడు సర్జరీలను మైక్రోస్కోప్ సహాయంతో హైదరాబాద్ వంటి మహానగరాలలోనే చేయగలిగినా, పేషెంట్ బంధువులు స్వప్న సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ వైద్యులపై నమ్మకంతో సర్జరీకి ఒప్పుకున్నారు. దీంతో వైద్యులు రిస్క్ తీసుకొని ఆపరేషన్ చేసి, కంప్లీట్ బ్రెయిన్ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించారు. పేషెంట్ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యాడు. ​ఈ మూడు క్లిష్టమైన కేసులను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా, నిర్మల్ పట్టణంలోని స్వప్న సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు మరోసారి నిరూపించింది

ప్రజలకు మెరుగైన వైద్యం

తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు స్వప్న హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్టు వైద్యులు  నాలం స్వప్న శశికాంత్ తెలిపారు. క్లిష్టమైన వైద్య సేవలను పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు