11 May, 2026 | 9:48 AM

ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల హవా

25-04-2024 12:59 AM

l ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల హవా

l ఫస్టియర్‌లో 470కి 469 మార్కులు సాధించిన అంకిత

l 31 కేజీబీవీల్లో వంద శాతం ఫలితాలు

ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఫస్టియర్‌లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులానికి చెందిన ఎం అంకిత 470కి 469 మార్కులు సాధించారు. సెకండియర్‌లో ఏగ్రేడ్ (75 శాతంపైగా మార్కులు) మార్కులను 4,810 మంది విద్యార్థులు సాధించారు. 7,834 మంది విద్యార్థులకు 6,643 (84.80 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఏగ్రేడ్ సాధించిన విద్యార్థులు 4,810 కాగా, బీ గ్రేడ్ సాధించిన వారు 1,446, సీ గ్రేడ్‌ను 325 మంది ఉన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో 13,321 మంది విద్యార్థులకు 9,580 (71.17 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్‌లో 950, ఫస్టియర్‌లో 460కిపైగా మార్కులను పదుల సంఖ్యలో విద్యార్థులు సాధించినట్లు అధికారులు తెలిపారు. 

కేజీబీవీ విద్యార్థుల హవా

ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థులు హవా చూపించారు. ఫస్టియర్‌లో 71.17 శాతం, సెకండియర్‌లో 83.91 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 20 కళాశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఫస్టియర్‌లో 11 కాలేజీలు సాధించాయి. ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో ఫస్టియర్‌లో 44.95 శాతం, సెకండియర్‌లో 45.56 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీలతోపాటు రెసిడెన్షియల్ గురుకులాల్లోనూ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచడంతో ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వారికి అభినందనలు తెలిపారు.