సర్కార్ బడిలోనే సకల సౌకర్యాలు
వాజేడు (విజయక్రాంతి): విద్యార్థులకు సర్కార్ బడిలోనే సకల సౌకర్యాలు, అత్యుత్తమ విద్యా బోధనను అందిస్తున్నామని శనివారం వాజేడు నాగారం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మండల పరిధిలో పలు గ్రామాలలో ఇంటింటిని సందర్శిస్తూ ప్రవేశాలు నమోదు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం(Professor Jayashankar Badi Bata Program)లో భాగంగా ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వివిధ బృందాలుగా విడిపోయి మండల పరిధిలో గల కాచారం, జంగాలపల్లి, జగన్నాధపురం, కొప్పుసూరు గ్రామాలలో ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రభుత్వ పాఠశాలలో గల సౌకర్యాలను విద్యా బోధనను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్, చల్లగురుగుల మల్లయ్య, వెంకటరమణ, ఆనంద్, శ్రీకాంత్, ప్రభాకర్, రాజేష్,కోకిల,శ్రీరంగం తెల్లం రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






