calender_icon.png 9 January, 2026 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఆల్ ఇండియా క్రికెట్ పోటీలు

07-01-2026 01:01:16 AM

  1. అంబర్‌పేట వాటర్ గ్రౌండ్స్‌లో నిర్వహణ
  2. ప్రారంభించనున్న మంత్రి వాకిటి శ్రీహరి 
  3. 10న ముగింపు పోటీలకు హాజరుకానున్న సీఎం  

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): క్రికెట్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే రాజీవ్ అండర్  ఆల్ ఇండియా క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోటీలు బుధవారంప్రారంభమవుతాయని సీఎఫ్‌ఐ చైర్మన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు తెలిపారు.

ఈ  పోటీలను  మంత్రి వాకిటి శ్రీహరి అంబర్‌పేటలో వాటర్‌వర్క్స్ గ్రౌండ్‌లో ప్రారంభిస్తారని తెలి పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 వ తేదీన ఎల్బీ స్టేడియం లో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని, విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం చేస్తారని వీహెచ్ తెలిపారు.

సీఎఫ్‌ఐ అధ్యక్షులు సాదిక్‌పాషా, ప్రధాన కార్యదర్శి అమర్ జిత్‌కు మార్, క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శంభుల శ్రీకాంత్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్. లక్ష్మణ్ యాదవ్, రజినీకాంత్, రాకేష్‌గౌడ్, మహేందర్‌గౌడ్, షకీల్ , మన్మోహన్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.