31 May, 2026 | 9:16 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

28 నుంచి ఆలిండియా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్

29-12-2025 12:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణలో స్కూల్ స్థాయి నుంచే ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసే ఉద్దేశంతో కుంచెట్టి ఖేల్‌క్షేత్ర ఆలిండియా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది. ఈ పోటీలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 8 వరకూ సరూర్ నగర్, గచ్చిబౌలీ స్టేడియాల్లో జరగనున్నాయి. అండర్ 16,అండర్ 17 కేటగిరీల్లో నిర్వహించబోతున్నారు.

ఈ చాంపియన్‌షిప్‌కు సంబంధించిన పోస్టర్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు.గత నెలలో 3 రోజుల పాటు జరిగిన తెలంగాణ ఇంటర్ స్కూల్ చాంపియన్‌షిప్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో   తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్ ప్రేమ్‌రాజ్, సెక్రటరీ బాబూరావు సాగర్, మాజీ కోశాధికారి కే మహేశ్వర్, డైరెక్టర్ కుంచెట్టి ఖేల్‌క్షేత్ సీఈవో భవానీ ప్రసాద్, 7హెచ్ స్పోర్ట్స్ ఫౌండర్ వెంకటేశ్ పాల్గొన్నారు.