31 May, 2026 | 8:25 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

హైదరాబాద్‌లో పుణె గ్రాండ్ టూర్ ట్రోఫీ

29-12-2025 12:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 28(విజయక్రాంతి) : వచ్చే నెలలో పుణే వేదికగా జరగ నున్న  గ్లోబల్ సైక్లింగ్ ఈవెంట్ బజాజ్ పుణె గ్రాండ్ టూర్‌కు సంబంధించిన ట్రోఫీ టూర్ హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ ట్రోఫీ ని తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటిa శ్రీహ రి ఆవిష్కరించారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ భారత్‌లో జరగడం దేశానికి గర్వకారణమన్నారు. ఇండియాలో తొలిసారి అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్ ఈ సైక్లింగ్ రేసును నిర్వహిస్తోంది.

జనవరి 19 నుంచి 23 వరకూ పుణెలో జరగనున్న ఈ అతిపెద్ద సైక్లింగ్ పోటీల్లో ప్రపంచస్థాయి రైడర్లు పాల్గొంటున్నారు. కాగా రానున్న రో జుల్లో క్రీడారాజధాని హైదరాబాద్‌లోనూ అంతర్జాతీయ సైక్లింగ్ ఈవెంట్లు జరగాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రోత్సాహం ఇస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్పోర్ట్స్ పాలసీతో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని చెప్పుకొచ్చారు. 437 కి.మీ మేర జరిగే ఈ రేస్ చారిత్రాత్మకంగా మిగిలిపోతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు.