29-12-2025 12:00:00 AM
విజయవాడ, డిసెంబర్ 28 : జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు విజయవాడలో ఘనంగా ముగిసాయి. ఈ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారులు కె.సాత్విక్ రెడ్డి, రాధిక శర్మ విజేతలుగా నిలిచారు. అలాగే పురుషుల సింగిల్స్‌లో ఎం.తరుణ్, మహిళల సింగిల్స్‌లో రక్షిత, మహిళల డబుల్స్‌లో వెన్నెల యు కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
ముగింపు వేడుకలకు భారత జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. తెలంగాణ క్రీడాకారులు ఈ పోటీల్లో అద్భుతంగా రాణించారని కితాబిచ్చారు. నిరంతర సాధన, క్రమశిక్షణతో పాటు లక్ష్యంపై అచంచల విశ్వాసం ఉంటే ప్రపంచ స్థాయి విజయాలు సాధిండం అసాధ్యం కాదని గోపీచంద్ వ్యాఖ్యానించారు. భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉందన్నారు.